ముంబై టార్గెట్ 222 పరుగులు. కానీ 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై కొట్టింది 99 పరుగులే..పైగా హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ అయిపోవటంతో నాలుగు వికెట్లు కోల్పోయింది ముంబై టీమ్. కళ్ల ముందు 14 రన్ రేట్. హార్దిక్ పాండ్యా అప్పుడే క్రీజులోకి వచ్చాడు. ఈ రేంజ్ రన్ రేట్ ను కొట్టాలంటే తిలక్ వర్మతో కలిసి ఆర్సీబీ తుక్కు రేగొట్టాలని డిసైడ్ అయినట్లున్నాడు. వచ్చిన మొదటి బంతి నుంచి బాదుతూనే ఉన్నాడు. అది కూడా ఎవరినీ ఫస్ట్ ఓవరే హేజిల్ వుడ్. ఎలా బౌలింగ్ చేస్తాడు ఆ ఆస్ట్రేలియన్ బౌలర్. కానీ అస్సలు లెక్కపెట్టలేదు హార్దిక్ పాండ్యా. మొదటి బంతికే సిక్స్ కొట్టాడు. అక్కడ మొదలు ఆ ఓవర్లోనే రెండు సిక్సులు, రెండు ఫోర్లు పిండుకున్నాడు హార్దిక్ పాండ్యా. అప్పుడు బంతిని హార్దిక్ పాండ్యా అన్నైన ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యాకు ఇచ్చాడు కెప్టెన్ రజత్ పటీదార్. ఎందుకంటే తమ్ముడి వీక్ నెస్ ఏంటో అన్నకు తెలుసుకా బట్టి కానీ కనికరం చూపలేదు హార్దిక్. కృనాల్ విసిరిన మొదటి రెండు బంతులను స్టాండ్స్ లోకి పంపాడు. ప్రెజర్ పెరిగిపోయిన కృనాల్ పాండ్యా రెండు వైడ్లు కూడా వేశాడు చిరాకులో. ఆ తర్వాత 15 బంతుల్లో 42 పరుగులు చేసిన హేజిల్ వుడ్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. కానీ హార్దిక్ చేతిలో కొట్టించుకున్న కృనాల్ మాత్రం ఆఖరి ఓవర్లో ముంబైను చావు దెబ్బ తీశాడు. లాస్ట్ ఓవర్ లో 19 పరుగులు చేస్తే ముంబై గెలుస్తుంది అనుకున్న టైమ్ లో మూడు వికెట్లు తీశాడు కృనాల్ కేవలం 7పరుగులు మాత్రమే ఇచ్చి తనను కొట్టిన తమ్ముడికి సమాధానం చెప్పటంతో పాటు తన తమ్ముడి టీమ్ కి వాళ్ల సొంతగడ్డపైనే ఓటమిని రుచి చూపించాడు. అలా ఈ అన్నదమ్ములు కృనాల్, హార్దిక్ ల పోరాటం మాత్రం క్రికెట్ ప్రేమికులకు మంచి మజాను ఇచ్చింది.